SRCL: ఇల్లంతకుంట మండలంలోని కందికట్కూరు గ్రామానికి చెందిన బత్తుల రవీందర్- కరుణ దంపతుల కుమారుడు శివకుమార్ ఇటీవల గ్రూప్ 1లో డీఎస్పీగా ఎంపికయ్యాడు. ఈ సందర్భంగా కందికట్కూరు గ్రామ మున్నూరు కాపు సంఘ భవనంలో మండల అధ్యక్షుడు యాస తిరుపతి ఆధ్వర్యంలో సంఘ సభ్యులతో కలిసి శివకుమార్‌ను ఘనంగా శాలువాతో సత్కరించి అభినందనలు తెలిపారు.