HYD: అమెరికాలో దుండగుడి దాడికి మరో తెలుగు యువకుడు బలయ్యాడు. హైదరాబాద్ ఎల్బీనగర్కు చెందిన పోలే చంద్రశేఖర్ ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లి, అక్కడ పెట్రోల్ బంక్‌లో పార్ట్‌టైమ్ ఉద్యోగం చేస్తున్నారు. ఈ ఉదయం ఇంధనం నింపించుకోవడానికి వచ్చిన ఓ దుండగుడు ఆకస్మికంగా చంద్రశేఖర్‌పై కాల్పులు జరిపాడు. దీంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందారు. హత్యకు గల కారణాలు ఇంకా తెలియలేదు.