SKLM: పశుపోషకులకు తీవ్ర నష్టం కలిగిస్తున్న గాలికుంటు వ్యాధి పట్ల అప్రమత్తంగా ఉండాలని పాతపట్నం పశుసంవర్ధక శాఖ సహాయ సంచాలకులు డాక్టర్ మంచు కరుణాకర్ రావు అన్నారు. శనివారం మెలియాపుట్టి మండలం కోసమాల గ్రామంలో జరుగుతున్న గాలికుంటు వ్యాధి నివారణ టీకాల కార్యక్రమాన్ని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పశువులకు విధిగా టీకాలు వేయించాలని కోరారు.