VSP: విశాఖ జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం శనివారం జడ్పీ ఛైర్మన్ సుభద్ర అధ్యక్షతన ప్రారంభమైంది. ఈ సందర్భంగా అధికారులు, ప్రజా ప్రతినిధులతో కలిసి పలు అభివృద్ధి, ప్రజాసమస్యలపై సమీక్షించారు. ముఖ్యంగా గ్రామీణ రహదారులు, తాగునీటి సమస్యలు, విద్యా, వైద్య సదుపాయాల అభివృద్ధిపై చర్చ సాగింది. సమస్యలకు త్వరితగతిన పరిష్కారం తీసుకురావాలని ఆమె సూచించారు.