ATP: దేవాలయాలను టార్గెట్ చేసి చోరీలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర దొంగల ముఠాను కళ్యాణదుర్గం పోలీసులు చాకచక్యంగా అరెస్టు చేశారు. వారి నుంచి రూ. 22 లక్షల విలువైన 12.350 కేజీల వెండి, 44 గ్రాముల బంగారం, ఇత్తడి గంటలు, రాగి బిందెలను స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురు పాత నేరస్తులు వ్యసనాలకు బానిసై దొంగతనాలకు పాల్పడ్డారని జిల్లా SP జగదీశ్ తెలిపారు.