NZB: ఎన్నికల విధుల పట్ల పరిపూర్ణ అవగాహన కలిగి ఉండాలని, స్థానిక సంస్థల ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో, సమర్ధవంతంగా నిర్వహించాలని కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి సూచించారు. ఎం.పీ.టీ.సీ, జెడ్.పీ.టీ.సీ ఎన్నికలకు సంబంధించిన రిటర్నింగ్ అధికారులు, సహాయ రిటర్నింగ్ అధికారులకు సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో శనివారం శిక్షణ తరగతులు నిర్వహించారు.