GDWL: జిల్లా విద్యాశాఖ అధికారి (డీఈఓ) విజయలక్ష్మి శనివారం మల్దకల్ మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలలో ఆమె తరగతి గదులు, సైన్స్ ప్రయోగశాల, కంప్యూటర్ గది, వంట గదులను పరిశీలించారు. అలాగే మధ్యాహ్న భోజనం నాణ్యతను, ఉపాధ్యాయులు, విద్యార్థుల హాజరును తనిఖీ చేశారు.