AP: ‘ఆటో డ్రైవర్ల సేవలో’ పథకాన్ని సీఎం చంద్రబాబు ప్రారంభించారు. లబ్ధిదారులకు రూ.436 కోట్లను అందించారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు మాట్లాడుతూ దసరా పండగను ప్రజలంతా సంతోషంగా జరుపుకున్నారని చెప్పారు. పవన్ ‘OG’ సినిమా చూశారు, దసరా పండగ చేసుకున్నారు, విజయవాడ ఉత్సవం బాగా జరిగింది, ఇప్పుడు ఆటో డ్రైవర్ల పండగలో ఉన్నామని పేర్కొన్నారు.