సత్యసాయి: పెనుకొండ మండలంలో అంబేడ్కర్ సర్కిల్లో బహుజన చైతన్య వేదిక ఆధ్వర్యంలో శనివారం ధర్నా నిర్వహించారు. బహుజన చైతన్య వ్యవస్థాపక అధ్యక్షుడు శివరామకృష్ణ మాట్లాడుతూ.. చిత్తూరు జిల్లా వెదురు కుప్పం మండలం దేవళంపేట గ్రామంలో అంబేడ్కర్ విగ్రహానికి నిప్పు పెట్టడాన్ని ఖండించిస్తున్నట్లు తెలిపారు. నిప్పు పెట్టిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.