PLD: గోకవరంలో రేపు దేవి చౌక్ అమ్మ వారి భారీ ఊరేగింపు కార్యక్రమం నిర్వహిస్తున్నారు. కావున ట్రాఫిక్ నియంత్రణలో భాగంగా రాజమండ్రి నుంచి వచ్చే వాహనాలు వీర్లంక పల్లి, కొత్తపల్లి మీదగా గోకవరం చేరుకోవాలని ఎస్ఐ పవన్ కుమార్ ఇవాళ తెలిపారు. అలాగే, రంపచోడవరం నుంచి వచ్చి, పోయే వాహనాలు పోక్స్ పేట, ఓజు బంధం మీదగా వెళ్లాలని ఆయన సూచించారు.