CTR: రొంపిచర్ల గ్రామ పంచాయతీలోని ఎర్రావారిపాలెం రోడ్డు చెరువును తలపిస్తుంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా కురుస్తున్న భారీ వర్షానికి రోడ్డు మొత్తం వర్షపు నీటితో నిండిపోయింది. వాహనాల రాకపోకలు పూర్తిగా స్తంభించాయి. పక్కనే ఉన్న చెరువు కూడా నిండిపోయింది. అధికారులు తగు చర్యలు తీసుకొని నీటిని చెరువుకి మళ్లించాలని స్థానికులు కోరారు.