TG: జూబ్లీహిల్స్ అసెంబ్లీ స్థానానికి జరిగే ఉపఎన్నికల్లో పోటీకి మజ్లిస్ దూరం ఉండనున్నట్లు తెలుస్తోంది. ఇటీవల ఓట్లు చీలనివ్వమని ఎంపీ అసదుద్దీన్ చేసిన వ్యాఖ్యలు అందుకు బలం చేకూరుస్తున్నాయి. అంతేకాకుండా BRSపై విమర్శనాస్త్రాలు సంధించిన అసదుద్దీన్.. కాంగ్రెస్కు మద్దతిస్తున్నట్లు పరోక్షంగా వెల్లడైంది. కాగా, పార్టీ నిర్ణయాన్ని అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.