ATP: సత్యసాయి బాబా శత జయంతి సందర్భంగా భక్తుల రద్దీ దృష్ట్యా ఉమ్మడి అనంతపురం జిల్లా మీదుగా ప్రత్యేక ప్యాసింజర్ రైళ్లు నడపనున్నట్లు డివిజన్ అధికారులు తెలిపారు. యశ్వంతపూర్-హిందూపురం ప్యాసింజరును. ఈ నెల 20 నుంచి 26 వరకు గుంతకల్లు జంక్షన్ వరకు పొడిగించినట్లు తెలిపారు. బెంగళూరు- ధర్మవరం మధ్య మరో ప్యాసింజరును ఈనెల 20 నుంచి 26 వరకు నడపనున్నట్లు తెలిపారు.