అమెరికాలో వలసదారుల చిన్నారులకు ట్రంప్ యంత్రాంగం ప్రత్యేక ఆఫర్ ప్రకటించింది. అమెరికా విడిచి వెళ్లిపోతే 2500 డాలర్లు ఇస్తామని వెల్లడించింది. స్వచ్ఛందంగా తమ దేశాన్ని వీడితే ఈ మొత్తం చెల్లించనున్నట్లు తెలిపింది. ఈ మేరకు డిపార్ట్మెంట్ ఆఫ్ హోంల్యాండ్ సెక్యూరిటీ లేఖ విడుదల చేసింది.