VZM: ఇటీవల కురిసిన భారీ వర్షాలకు జరిగిన పంట నష్టాలను, రహదారులు, విద్యుత్ తదితర నష్టాలను అంచనా వేసి శనివారం సాయంత్రంలోగా పంపాలని కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి ఆదేశించారు. ఎటువంటి వివాదాలకు తావు లేని, ఖచ్చితమైన, పారదర్శకమైన అంచనాలను క్షేత్ర స్థాయిలో పర్యటించి వాస్తవాలను పంపాలని సూచించారు.