VZM: ఉత్తరాంధ్ర స్థాయి ఈత పోటిల్లో జిల్లాకు చెందిన పారా స్విమ్మర్స్ ప్రతిభ చాటారని పారా స్పోర్ట్స్ అసోసియేషన్ జిల్లా గౌరవ అధ్యక్షులు కె.దయానంద్ ఇవాళ తెలిపారు. విశాఖపట్నం జీవీఎంసీ ఆక్వా ఈత కొలనులో అట్టహాసంగా నిర్వహించిన ఈత పోటిల్లో జిల్లాకు చెందిన పారా స్విమ్మర్స్ మౌనిక, ప్రియాంకదాస్ ప్రతిభ కనబరచి రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికయ్యారని తెలిపారు.