AP: స్త్రీ శక్తికి ముందే ఆటోడ్రైవర్ల గురించి ఆలోచించామని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. ఆటో డ్రైవర్లకు ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. ‘వైసీపీ ప్రభుత్వంలో ఇబ్బందులను ఆటో డ్రైవర్లు మా దృష్టికి తీసుకొచ్చారు. ఆటో డ్రైవర్లకు ఇబ్బంది రానీయబోమని సీఎం చెప్పారు. అందుకు తగ్గట్టుగానే రూ.15 వేలు ఇస్తున్నాం. ఈ పథకం కోసం రూ.436 కోట్లు ఖర్చు చేస్తున్నాం’ అని వెల్లడించారు.