VZM: విజయనగరం శ్రీ పైడితల్లి అమ్మవారి దేవస్థానం పాలకమండలి సభ్యుల నూతన నియామకం స్థానిక విజయనగరం కోట రౌండ్ మహల్లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో దేవస్థానం ఛైర్మన్ హోదాలో గోవా రాష్ట్ర గవర్నర్ పూసపాటి అశోక్ గజపతి రాజు, ఎమ్మెల్యే అదితి గజపతిరాజు పాల్గొని ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు రాజేష్ వర్మ, యశస్వి పాల్గొన్నారు.