ప్రకాశం: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఆటో డ్రైవర్ల సేవా కార్యక్రమాన్ని మార్కాపురం సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే కందుల స్వయంగా ఆటో నడిపి ఉత్తేజపరిచారు. ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టర్, తహసీల్దార్ చిరంజీవి, ఆర్టీవో చందన, పలు అధికారులు, ఆటో డ్రైవర్లు, తదితరులు పాల్గొన్నారు.