PLD: స్త్రీ శక్తి పథకం అమలుతో నష్టపోతున్న ఆటో డ్రైవర్ల సంక్షేమం కోసం ప్రభుత్వం ముందడుగు వేసింది అని గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు అన్నారు. శనివారం పిడుగురాళ్ల పట్టణంలో టీడీపీ కార్యాలయం వద్ద “ఆటో డ్రైవర్ల సేవలో” కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆటో డ్రైవర్లకు సహాయ చెక్కులను పంపిణీ చేశారు.