ASF: జిల్లాలో 32 మద్యం దుకాణాల కేటాయింపు కోసం గత నెల 26 నుంచి ఎక్సైజ్ అధికారులు దరఖాస్తులు ఆహ్వానించారు. అయితే, స్థానిక సంస్థల ఎన్నికల ప్రకటన రావడంతో ప్రభుత్వం ఆశించిన స్థాయిలో దరఖాస్తులు రావడం లేదు. సెప్టెంబర్ 26 నుంచి ఇప్పటివరకు కేవలం 6 దరఖాస్తులే వచ్చాయి. దరఖాస్తులు స్వీకరించడానికి ఈ నెల 18 వరకు గడువు ఉంది.