SRPT: అర్వపల్లి మండల కేంద్రంలోని ప్రభుత్వ దవాఖాన, తాహసీల్దార్ కార్యాలయాన్ని కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రభుత్వ ఆస్పత్రిలో సహజ కాన్పులు అయ్యే విధంగా గర్భిణీలకు అవగాహన కల్పించాలని సూచించారు. ప్రజలకు అందుతున్న సేవల గురించి డాక్టర్ నగేశ్‌ను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం రికార్డులను పరిశీలించారు.