JN: చిల్పూర్ మండలం చిన్న పెండ్యాల భారత్ పెట్రోల్ బంకు సమీపంలో శనివారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ కారు టైర్ బ్లాస్ట్ కావడంతో డివైడర్‌ను ఢీకొని, టర్నింగ్ వద్ద మరో కారును ఢీకొట్టింది. దీంతో కారు పూర్తిగా ధ్వంసమైందని స్థానికులు తెలిపారు. ఈ ప్రమాదంలో డ్రైవర్‌కు తీవ్ర గాయాలు కాగా, పలువురికి స్వల్ప గాయాలయ్యాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.