కృష్ణా: రాష్ట్రంలో ప్రజలు కష్టాలు తెలుసుకొని, పరిష్కరిస్తున్న గొప్ప నాయకుడు సీఎం చంద్రబాబు నాయుడని ఎమ్మెల్యే రాము కొనియాడారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఆటో డ్రైవర్ల సేవలో పథకం ప్రారంభోత్సవ కార్యక్రమాలు గుడివాడలో శనివారం ఘనంగా జరిగాయి. మార్కెట్ యార్డ్ ప్రాంగణంలో జరిగిన వేడుకల్లో ఎమ్మెల్యే పాల్గొని, ఆటో డ్రైవర్లకు శుభాకాంక్షలు తెలిపారు.