VZM: స్వచ్ఛాంధ్ర-స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా విజయనగరం జిల్లాకు 2 రాష్ట్రస్థాయి అవార్డులు, 48 జిల్లాస్థాయి అవార్డులు వచ్చాయని కలెక్టర్ రామ సుందర్ తెలిపారు. రాష్ట్రస్థాయి అవార్డు గ్రహితలను ఈ నెల 6న అవార్డులు తీసుకోవడానికి విజయవాడ పంపిస్తున్నామని, జిల్లాస్థాయి అవార్డు గ్రహీతలకు జిల్లాలో ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేసి అవార్డులను పంపిణీ చేస్తామన్నారు.