TG: జూబ్లీహిల్స్ ఉపఎన్నికలు వచ్చే సరికి హరీశ్ రావుకు సమస్యలు గుర్తుకు వచ్చాయని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. ‘HYD నగర ప్రజలను పక్కదారి పట్టించడానికి హరీశ్ రావు హడావుడి మొదలుపెట్టారని తెలిపారు. కొత్తపేట టిమ్స్ ఆస్పత్రి దగ్గర హరీశ్ రావు, BRS MLAలు షో చేశారు. పదేళ్లు అధికారంలో ఉండి సూపర్ స్పెషాలిటీ ప్రభుత్వ ఆస్పత్రులను ఎందుకు నిర్మించలేదో చెప్పాలి’ అంటూ డిమాండ్ చేశారు.