బాలీవుడ్ హీరోయిన్ జాన్వీ కపూర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. నటీనటులను బయట వ్యక్తులు, సినీ పరిశ్రమకు చెందినవారు అని విభజించడం తనకు ఇష్టం ఉండదని చెప్పింది. అలాగే.. స్టార్ కిడ్స్ ఇబ్బందులు చెప్పినా విడ్డూరంగా ఉంటాయని.. వాటిని వినడానికి కూడా ఎవరూ ఆసక్తి చూపరని తెలిపింది. అయితే, బయట వ్యక్తుల కష్టాలు వినడానికి అందరూ ఆసక్తి చూపుతారని పేర్కొంది.