KRNL: ఈ-క్రాప్ నమోదుకు గడువు పొడిగించినట్లు ఏవో సుచరిత తెలిపారు. శనివారం పెద్దకడబూరులో ఆమె మాట్లాడుతూ.. ఖరీఫ్ సీజన్‌కి సంబంధించిన ఈ-పంట నమోదు గడువును ఈనెల 25 వరకు పెంచినట్లు పేర్కొన్నారు. సామాజిక తనిఖీ, సవరింపులు, మార్పులు ఈనెల 30 వరకు అవకాశం ఉందన్నారు. తుది జాబితా ఈనెల 31న రైతు సేవా కేంద్రాల్లో ప్రదర్శించబడుతుందని తెలిపారు.