ఈ-కామర్స్ సంస్థలు ‘క్యాష్ ఆన్ డెలివరీ’ (COD) కోసం అదనపు ఛార్జీలు వసూలు చేయడంపై కేంద్ర ప్రభుత్వం సీరియస్గా ఉంది. ఈ విధానాన్ని కొన్ని సంస్థలు అనుసరిస్తున్నట్లుగా వినియోగదారుల వ్యవహారాల శాఖకు ఫిర్యాదులు అందాయి. దీనిపై కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి స్పందించారు. ఈ విషయంపై పూర్తిస్థాయిలో దర్యాప్తు జరుపుతామని, వినియోగదారులకు అన్యాయం జరగకుండా చూస్తామని ఆయన హామీ ఇచ్చారు.