TG: ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న మరో ఇద్దరు ఎమ్మెల్యేలను స్పీకర్ ఇవాళ విచారించనున్నారు. కాసేపట్లో గూడెం మహిపాల్ రెడ్డి, బండ్ల కృష్ణమోహన్ రెడ్డిని విచారించనున్నారు. గూడెం మహిపాల్ రెడ్డిపై చింతా ప్రభాకర్ రెడ్డి పిటిషన్ వేశారు. దీంతో ఆయన లాయర్లను చింతా ప్రభాకర్ రెడ్డి లాయర్లు క్రాస్ ఎగ్జామినేషన్ చేయనున్నారు.