ELR: నూజివీడు మండలంలోని అన్నవరం జడ్పీ హైస్కూల్‌ను డివిజనల్ ఉప విద్యాశాఖ అధికారి పీవీఎస్ సుధాకర్ శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పలు రికార్డులను తనిఖీ చేసి తగిన సూచనలు అందించారు. డీవైఈవో సుధాకర్ మాట్లాడుతూ.. పదవ తరగతి విద్యార్థులలో మెరుగైన ఫలితాలు సాధించేందుకు ప్రణాళికాబద్ధంగా కృషి చేయాలన్నారు. క్రీడలలోను విద్యార్థులను ప్రతిభావంతులుగా తీర్చేదిద్దాలన్నారు.