AP: అనకాపల్లి(D) పాయకరావుపేట(M) గుల్లిపాడు వద్ద రత్నాచల్ ఎక్స్ప్రెస్కు సాంకేతిక లోపం తలెత్తింది. దీని కారణంగా విజయవాడ-విశాఖపట్నం మధ్య నడిచే ఈ ఎక్స్ప్రెస్ రైలు గంటకు పైగా అక్కడే నిలిచిపోయింది. రైలు నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. సాంకేతిక లోపాన్ని సరిదిద్ది రైలును తిరిగి ప్రారంభించేందుకు రైల్వే సిబ్బంది ప్రయత్నిస్తున్నారు.