PPM: సాలూరు ఆర్టీసీ డిపోకు చెందిన కండక్టర్ ఏ. దాసు (61) విధుల నిమిత్తం సాలూరు నుండి విశాఖపట్నం వెళ్లే బస్సుకు శనివారం విధులకు హాజరయ్యారు. బస్సు రామభద్రపురం వచ్చే సరికి గుండెనొప్పితో కుప్పకూలిపోయాడు. బస్సులో ఉన్న యూనియన్ నాయకులు హుటాహుటిన స్థానిక ఎన్.ఆర్.ఐ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు తనిఖీ చేయగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు.