BDK: సీఆర్పీఎఫ్ 81 బెటాలియన్ ఆధ్వర్యంలో శనివారం చర్ల మండలంలోని సత్యనారాయణపురం గ్రామంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. వైద్య శిబిరాన్ని సీఆర్పీఎఫ్ 81 బెటాలియన్ కమాండెంట్ ముకేష కుమార్, డిప్యూటీ కమాండెంట్ రాజేష్ డోగ్రాలు ప్రారంభించారు. ఉచిత వైద్య శిబిరంలో సీఆర్పీఎఫ్ డాక్టర్ ఫైజీ ఆరోగ్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు.