మహబూబ్ నగర్: దేవరకద్ర నియోజకవర్గం మదనపురం మండలం అజ్జకొల్లు షుగర్లోని సరళ సాగర్ ప్రాజెక్టు వద్ద చేపల వేటకు వెళ్లి కొత్త కొత్త పట్టణానికి చెందిన శేఖర్ గల్లంతయ్యారు. విషయం తెలుసుకున్న దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూదన్ రెడ్డి ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షించారు. అనంతరం ఎస్డీఆర్ఎఫ్ సిబ్బందితో మాట్లాడి గాలింపు చర్యలను వేగవంతం చేయాలని సూచించారు.