MNCL: కళ్యాణి ఖని ఓపెన్ కాస్ట్ లో ఉత్పత్తి, మెయింటెనెన్స్ విభాగాల్లో ప్రతిభ కనబరిచిన ఉద్యోగులను మందమర్రి ఏరియా జీఎం రాధాకృష్ణ శనివారం సన్మానించి, బహుమతులు అందజేశారు. కేకే ఓసీపీలో ఓబీ (OB) బొగ్గును డిపార్టుమెంటల్ యంత్రాల ద్వారా ఉద్యోగులు ఉత్పత్తి చేయడం అభినందనీయమన్నారు. ఉత్పత్తి పెంపుతో పాటు ప్రతి ఒక్కరూ భద్రతకు ప్రాధాన్యమిస్తూ కృషి చేయాలన్నారు.