ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో పీఎం-సేతు పథకాన్ని ప్రధాని మోదీ ప్రారంభించారు. ఈ పథకం విద్య, నైపుణ్యాభివృద్ధికి తోడ్పడుతుందని ఆయన పేర్కొన్నారు. ఇది దేశవ్యాప్తంగా 1,000 ప్రభుత్వ ఐటీఐలను (ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్) అప్గ్రేడ్ చేయడానికి రూపొందించిన కేంద్ర ప్రాయుక్త పథకం. దీని మొత్తం పెట్టుబడి రూ.60,000 కోట్లు.