మేడ్చల్: BRS ప్రభుత్వ హయాంలో HYD నగరంలో 4 టిమ్స్ ఆస్పత్రుల నిర్మాణం చేపట్టామని BRS నేత, మాజీ మంత్రి హరీష్ రావు తెలిపారు. పేదలకు సూపర్ స్పెషాలిటీ సేవలు అందాలని నిర్మాణాలు చేపట్టామని, కానీ.. మేడ్చల్ జిల్లాలో మెడికల్ కాలేజీ లేకుండా చేశారని ప్రభుత్వాన్ని హరీష్ రావు విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందో ఎవరికి అర్థం కావడం లేదన్నారు.