జనగాం: జడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్ ఎన్నికలకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పక్కాగా ఉండాలని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ అన్నారు. స్ట్రాంగ్ రూమ్, కౌంటింగ్ కేంద్రాల కోసం ఏకాశీల బీఈడి కాలేజ్, ఏబీవీ, VBIT కాలేజీలను అలాగే జనగామ మండలం సంబంధించి డిస్ట్రిబ్యూషన్, రిసెప్షన్ కేంద్రం కోసం స్థానిక గౌతమ్ మోడల్ స్కూల్‌ను సంబంధిత అధికారులతో పరిశీలించారు.