కోనసీమ: మలికిపురంలో ‘ఆటో డ్రైవర్ల సేవలో’ కార్యక్రమం నిర్వహించారు. ఈ పథకం ద్వారా ప్రతి సంవత్సరం ఆటో డ్రైవర్ రూ.15 వేలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ సందర్భంగా రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ మాట్లాడుతూ.. ఆటో కార్మికులను ఆదుకోవడం మంచి పరిణామం అని తెలియజేశారు. ఎన్నికలలో ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తున్నామన్నారు. అనంతరం ఆయన ఆటో నడిపి సందడి చేశారు.