PDPL: లారీ యాజమానుల సమస్యల పరిష్కారానికి రామగుండం ఎమ్మెల్యే ఎంఎస్. రాజాకూర్ ఎంతగానో కృషి చేస్తున్నారని రామగుండం ఏరియా లైన్ లారీ యజమానుల సంక్షేమ సంఘం అధ్యక్షులు కే.శ్రీనివాస్ రెడ్డి అన్నారు. సంఘ కార్యాలయంలో సభ నిర్వహించారు. గత సంవత్సరం దసరా నుండి ఈ సంవత్సరం దసరా వరకు అసోసియేషన్ సాధించిన విజయాలు, అభివృద్ధి కార్యక్రమాలను సమగ్రంగా వివరించారు.