భారత్‌లో పలు బ్యాంకులను రూ.వేల కోట్ల మేర మోసం చేసి విదేశాలకు పారిపోయిన వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీని భారత్‌కు అప్పగించడానికి లైన్ క్లియర్ అయినట్లు తెలుస్తోంది. నవంబర్ 23న అతడిని భారత్‌కు అప్పగించనున్నట్లు సమాచారం. ఈ అప్పగింత ప్రక్రియ పూర్తయితే, రూ.వేల కోట్ల మోసంలో ప్రధాన నిందితుడైన నీరవ్‌ను విచారించేందుకు మార్గం సుగమమవుతుంది.