CTR: కేజీసత్రం సమీపంలో బెంగళూరు-చెన్నై జాతీయ రహదారిపై బైక్ డివైడర్ను ఢీకొంది. ఈ ప్రమాదంలో బైక్పై వెళ్తున్న వ్యక్తి మృతి చెందాడు. పోలీసుల వివరాలు మేరకు.. పాలసముద్రంకి చెందిన రామచంద్రయ్య సెట్టి బెంగళూరులో నివాసం ఉంటూ చిత్తూరు వైపు నుంచి బెంగళూరు వైపు వెళ్తున్న సమయంలో డివైడర్ని ఢీకొన్నాడు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని మార్చరీకి తరలించారు.