MHBD: మహబూబాబాద్ పట్టణంలోని మూడు కోట్లు సెంటర్ వద్ద జై భవాని యూత్ ఆధ్వర్యంలో దుర్గామాత నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఐదో రోజు మహాలక్ష్మి అవతారంలో అమ్మవారు దర్శనమిచ్చారు. ఈ అవతారంలో అమ్మవారు ధరించిన చీరను యూత్ కమిటీ శనివారం వేలం వేసింది. పద్మం ప్రవీణ్ కుమార్ దంపతులు రూ.2,50,202కు చీరను కైవసం చేసుకున్నారు.