ASR: అక్టోబరు నెల సామాజిక పింఛన్ల పంపిణీలో జిల్లాకు రాష్ట్రంలో ప్రథమ స్థానం లభించింది. జిల్లాలోని 22మండలాల పరిధిలో 1,22,507మంది పింఛన్ల లబ్దిదారులకు శుక్రవారం రాత్రి నాటికి 1,20,872మంది లబ్దిదారులకు పెన్షన్ సొమ్మును అందించినట్టు కలెక్టర్ దినేష్ కుమార్ తెలిపారు. పంపిణీ శాతం 98.67 నమోదైంది. రాష్ట్రంలో జిల్లాకు ప్రథమ స్థానం దక్కడంతో అధికారులను అభినందించారు