AP: ఆటో, ట్యాక్సీ, మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్ల కోసం ప్రభుత్వం కొత్త పథకాన్ని ప్రారంభించింది. CM చంద్రబాబు, Dy CM పవన్ ఈ పథకాన్ని ప్రారంభించారు. దీంతో అర్హులైన డ్రైవర్ల ఖాతాల్లో రూ. 15,000 చొప్పున జమ చేశారు. తొలి విడతలో 2,90,669 మంది డ్రైవర్ల ఖాతాల్లో మొత్తం రూ.436 కోట్ల నిధులు జమ చేశారు. ఆటో డ్రైవర్లకు ఈ పథకం ద్వారా లబ్ధి చేకూరుతుందని సీఎం అన్నారు.