SDPT: స్థానిక ఎన్నికలకు షెడ్యూల్ విడుదల కావడంతో పల్లెల్లో హడావుడి మొదలైంది. ఈ ఎన్నికల్లో పోటీ చేసే వారు భవిష్యత్ కార్యాచరణ పై దృష్టి సారిస్తున్నారు. ఇప్పటికే టికెట్ ప్రయత్నాలు మొదలు పెట్టిన ఆయా పార్టీల నేతలు ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. గ్రామాల్లో ఎటు చూసినా ఎన్నికల ముచ్చటే వినబడుతుంది. జిల్లా వ్యాప్తంగా 508 గ్రామ పంచాయతీలు, 4,508 వార్డులు ఉన్నాయి.