SS: గోరంట్ల మండలం కలిగేరి గ్రామంలో మాజీ మంత్రి ఉషశ్రీ చరణ్ శనివారం పర్యటించారు. వైసీపీ ప్రతిష్టాత్మకగా చేపట్టిన డిజిటల్ బుక్ ను నాయకులతో కలసి ఆవిష్కరించారు. ఆమె మాట్లాడుతూ.. వైసీపీ కార్యకర్తలు పడే కష్టాలను బాధలను ఈ డిజిటల్ బుక్లో పొందుపరచవచ్చన్నారు. కూటమి ప్రభుత్వం సంక్షేమ పథకాలను పక్కనపెట్టి రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తుందన్నారు.