KMR: కామారెడ్డి పట్టణ కేంద్రంలోని మున్సిపల్ పరిధిలో గల రెండో వార్డ్ రామేశ్వరపల్లి డబల్ బెడ్ రూమ్ వాసులు సిరిసిల్ల బైపాస్ ధర్నా నిర్వహించారు. రామేశ్వరపల్లి డబల్ బెడ్ రూమ్ వాసులకు గత నెల రోజులుగా త్రాగు నీరు రావడం లేదని డబల్ బెడ్ రూమ్ వాసులు సిరిసిల్ల బైపాస్ వద్ద ధర్నా నిర్వహించారు. ధర్నా చేస్తూ బైఠాయించారు. ఇరువైపుల వాహనాలు నిలిచిపోయాయి.