GNTR: కాకుమాను మహిళా సర్పంచ్ పసుపులేటి శివ కుమారి (62) అనారోగ్యం కారణంగా మృతి చెందారు. ఆమె 2021 సంవత్సరంలో వైసీపీ మద్దతుతో ఏకగ్రీవ సర్పంచ్‌గా ఎన్నికయ్యారు. అప్పటి నుంచి గ్రామంలో పాలన చేస్తున్నారు. 10 రోజుల నుంచి ఆమె అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్నారు. శుక్రవారం అర్ధరాత్రి ఆమె మృతి చెందినట్లు శనివారం కుటుంబ సభ్యులు తెలిపారు.